సాగర్‌లో కొనసాగుతున్న వరుణ యాగం
హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు
మిర్యాలగూడ, ఆంధ్రప్రభ: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ విజయవిహార్‌లో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు వరుణ యాగం ప్రారంభమైంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పద్మావతి దంపతులు యాగంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సిద్ధాంతి సత్యనారాయణశర్మ ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో 11 యజ్ఞగుండాల్లో వరుణ యాగాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు.
