మహా రుద్రాభిషేకం
చాముండేశ్వరాలయంలో భక్తుల కిటకిట
ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు లోని ప్రాచీన శైవ క్షేత్రం శ్రీ చాముండేశ్వర స్వామి ఆలయం లో ఆషాడ చివరి సోమవారం సందర్భంగా స్వామివారికి మహా రుద్రాభిషేకం జరిగింది. ఆలయ అర్చకులు ముల్లకల్ రఘునాథన్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి విశేషాలంకరణ జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
