అమ్మవారి ఆలయానికి రూ.1.35 లక్షల ఆర్థిక సాయం..
పాయకాపురం, ఆంధ్రప్రభ : 61వ డివిజన్ శాంతినగర్‌లోని అమ్మవారి ఆలయానికి స్టీల్ గ్రిల్స్ ఏర్పాటు చేసేందుకు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు రూ.1.35 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆదివారం ఆలయ నిర్వాహకులకు ఈ మొత్తాన్ని అందజేశారు.
సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను కలిసి ఆలయానికి స్టీల్ గ్రిల్స్ అవసరాన్ని వివరించారు. ఆలయ భద్రతతో పాటు భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రిల్స్ ఏర్పాటు చేయాలని కోరారు.
వారి అభ్యర్థనపై ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వెంటనే స్పందించి ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు రూ.1,35,000 ఆర్థిక సాయం అందించారు. ప్రజల అవసరాలను గుర్తించి వారు కోరిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారని టీడీపీ నాయకులు తెలిపారు.
