డాన్సర్స్‌ అసోసియేషన్‌ ఉప ఎన్నికల ఫలితాలు విడుదల

  • కీలక పదవుల్లో కొత్త సభ్యులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: డాన్సర్స్‌ అసోసియేషన్‌ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. రాజీనామా చేసిన సభ్యుల స్థానాల భర్తీ కోసం నిర్వహించిన ఈ ఎన్నికల్లో పలు కీలక పదవులకు కొత్త సభ్యులు ఎన్నికయ్యారు.

జనరల్‌ సెక్రటరీగా జి. బాలకృష్ణ (కార్డు నంబర్‌–426), ట్రెజరర్‌గా పి. ఇజ్రాయిల్‌ (కార్డు నంబర్‌–212) ఎన్నికయ్యారు. అసోసియేషన్‌లో మొత్తం 602 మంది సభ్యులు ఉండగా.. ఉప ఎన్నికల్లో 114 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో రెండు ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి. ఎన్నికల ప్రక్రియ ఏకగ్రీవంగా పూర్తయినట్లు ఎన్నికల పత్రంలో పేర్కొన్నారు.

ఉపాధ్యక్షుడిగా జి. రమేష్‌ (కార్డు నంబర్‌–53), జాయింట్‌ సెక్రటరీగా పి. నాగ మల్లేశ్వర్‌ రావు (కార్డు నంబర్‌–481), ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా జి. రవితేజ (కార్డు నంబర్‌–481) ఎన్నికయ్యారు.

కమిటీ సభ్యులుగా పి. కన్నయ్య (కార్డు నంబర్‌–177), ఎం. రమేష్‌ (చిన్నీ) (కార్డు నంబర్‌–500), ఎం. రాములు (కార్డు నంబర్‌–531), బి. వెంకన్న (కార్డు నంబర్‌–415) ఎన్నికయ్యారు. మహిళా ఈసీ సభ్యులుగా కె. నిరంజని, సీహెచ్‌. సాయి లక్ష్మి ఎన్నికైనట్లు ప్రకటించారు.

ప్రస్తుతం డాన్సర్స్‌ అసోసియేషన్‌లో 600 మందికి పైగా సభ్యులు ఉన్నారు. రాజీనామా చేసిన సభ్యుల స్థానాల భర్తీ కోసం ఈ ఉప ఎన్నికలు నిర్వహించారు.

ఇదిలా ఉండగా.. ఉప ఎన్నికల నిర్వహణ అంశంపై గతంలో వివాదం నెలకొంది. ఎన్నికలు నిర్వహించవద్దని ఫెడరేషన్‌ సూచించినప్పటికీ, అధ్యక్షురాలు సుమలత ఎన్నికల ప్రక్రియను కొనసాగించారని సమాచారం. దీనిపై ఫెడరేషన్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఫెడరేషన్‌ నిర్ణయాలను పట్టించుకోలేదన్న అంశంపై సహాయ నిరాకరణ ప్రకటించినట్లు ప్రచారం జరిగినా.. ఉప ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా ముగిసి ఫలితాలు విడుదలయ్యాయి.