అభివృద్థి, సంక్షేమానికి పునాదులు వేసిన టీడీపీ

  • 11వ డివిజన్‌లో టీడీపీ డోర్‌-టు-డోర్‌ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

(విజయవాడ, ఆంధ్రప్రభ) : తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటేనే అభివృద్థి, సంక్షేమం అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్‌ పటమట రైతు బాజర్‌ హైస్కూల్‌ రోడ్డులోని కనకమేడల రవీంద్రకుమార్‌ కళ్యాణ మండపం ఏరియాలో టీడీపీ డోర్‌-టు-డోర్‌ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ముఖ్యఅతిధిగా పాల్గొని ఇంటింటికి వెళ్ళి కూటమి ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటేనే సంక్షేమం, అభివృద్థి అని అన్నారు.

నగరంలో ఏ అభివృద్థి కార్యక్రమం చూసినా అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హాయంలోనే చేపట్టామని చెప్పారు. నగరంలో ప్రధాన రహదారులను, ప్లై-వోవర్లను, కల్వర్టులను, తాగు నీటి ట్యాంకులను, పైపులను నిర్మాణం చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. అభివృద్థి, సంక్షేమానికి పునాది తెలుగుదేశం పార్టీ చెప్పారు. అందువల్లనే తెలుగుదేశం పార్టీ ఏ ఎన్నికల్లోనైనా ఘన విజయాలు సాధిస్తోందని చెప్పారు. గత ఎన్నికల్లో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాయ మాటలను నమ్మి ప్రజలు ఒక సారి ఆయనకు అవకాశం ఇచ్చారని, నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్థిని అంతా జగన్‌ నాశనం చేశాడని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడి సహకారంతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభివృద్థి వైపునకు పరుగులు పెట్టిస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు. టీడీపీ డోర్‌-టు-డోర్‌ కార్యక్రమంలో ఈ రెండు సంవత్సరాల కూటమి ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్థి, సంక్షేమాన్ని తెలియజేస్తున్నామని, కూటమి ప్రభుత్వం పాలనలో తాము సంతోషంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో నాదెళ్ళ రాజేష్, పేరేపి ఈశ్వర్, కోనేరు రాజేష్, జాస్తి సురేష్, బంగారు మురళీ, దేవరపల్లి ఆంజనేయలు, లంకా రేవంత్, యలమంచిలి శ్రీధర్, మహాలి సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.