దోనబండ క్వారీలో ప్రమాదం.. వ్యక్తి మృతి

  • న్యాయం చేయాలంటూ క్రషర్ ముందు మృతుని బంధువుల ధర్నా

కంచికచర్ల, ఆంధ్ర‌ప్ర‌భ‌ : క్వారీలో పని చేస్తున్న జెసిబికి డీజిల్ తీసుకు ఉన్న ఆటో ప్రమాదానికి గురవటంతో ఆటో డ్రైవర్ మృతి చెందిన సంఘటన కంచికచర్ల మండలం పరిటాల సమీపంలోని దొనబండ క్వారీలో చోటుచేసుకుంది. పోలీసుల అందించిన వివరాల ప్రకారం కంచికచర్ల మండలం పరిటాల దొనబండ క్వారీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వర్చూ క్వారీలో కొండపై ఉన్న జేసీబీకి శనివారం రాత్రి ప్రాంతంలో డీజిల్ తీసుకెళ్తున్న టాటా ఏస్ వాహనం అదుపుతప్పి క్వారీ బండను ఢీకొట్టింది.

ఈ ఘటనలో వాహన డ్రైవర్, ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన అబ్బూరి రాంబాబు (31) మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని నందిగామ మార్చురీకి తరలించారు. డ్రైవర్ మృతి చెందిన సంఘటనపై క్వారీ యాజమాన్యం స్పందించకపోవడంతో మృతుని బంధువులు న్యాయం చేయాలంటూ క్రషర్ ముందు ధర్నా చేస్తున్నారు.