మంత్రుల పర్యటనకు ఘనంగా ఏర్పాట్లు
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : ఎల్కతుర్తి మండల కేంద్రంలో సోమవారం జరగనున్న రాష్ట్ర మంత్రుల పర్యటనకు అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 10న ఉదయం 10 గంటలకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్కతుర్తిలో పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కేజీబీవీ నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో హనుమకొండ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ రవి, అదనపు కలెక్టర్, తహసీల్దార్, సంబంధిత శాఖల అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు కార్యక్రమ ప్రాంగణాలను పరిశీలించారు. ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ఇతర సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు.
