పిప్రిలో చికెన్, మటన్ మార్కెట్ షెడ్ ప్రారంభం
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండలం పిప్రి(జె) గ్రామంలో నూతనంగా నిర్మించిన చికెన్, మటన్ మార్కెట్ షెడ్‌ను గ్రామ సర్పంచ్ అరిగెల జనార్ధన్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని మార్కెట్‌కు ప్రత్యేక షెడ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వీడీసీ సభ్యుల సహకారంతో నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు.
కార్యక్రమంలో పల్లె శ్రీనివాస్, కోడిగల స్వామి, శంక భూమన్న, లింబాద్రి, అశోక్, కటికేసాయం, కట్ట కిషన్ తదితరులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
