ఘనంగా జాతీయ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం
వేములవాడ, ఆంధ్రప్రభ: వేములవాడ పట్టణంలో జాతీయ యూత్ కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాత నవీన్, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, వేములవాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, సీనియర్ నాయకులు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సంఘ స్వామి యాదవ్, వేములవాడ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోటలహరి, ఇర్ఫాన్‌తో పాటు వార్డు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువతను రాజకీయంగా చైతన్యవంతులను చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి యూత్ కాంగ్రెస్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యువతకు మరిన్ని అవకాశాలు కల్పిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.
