మంగపేటలో ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు
మంగపేట, ఆంధ్రప్రభ: ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ములుగు జిల్లా మంగపేట మండలంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో ఆదివాసీ నాయకులు జెండాలు ఎగురవేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన ఆదివాసీ గ్రామ పెద్దలు, సంఘాల ప్రతినిధులు, మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు, ఆదివాసీ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. బోరు నర్సాపురం నుంచి మండల కేంద్రంలోని కొమురం భీం విగ్రహం వరకు సంప్రదాయ నృత్యాలతో ర్యాలీ సాగింది.
అనంతరం ఆదివాసీ సంఘాల నాయకులు కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు గొప్ప సమ్మారావు, కొండా చెంచయ్య, జబ్బ రవి, మద్దెల అంజయ్య, తాటి నాగరాజు, అయ్యోరి యానయ్య, తోలెం నరసింహారావు, పూనెం ప్రశాంత్, కోడం శ్రీను, చాద మల్లయ్య, కుర్సం రమేష్, పొదెం రవీందర్, పొదెం నాగేష్, కబ్బాక లక్ష్మణ్, బాడిశ ఆదినారాయణ, ఆక తిరుమలరావు, మడి శోభన్, నల్లేబోయిన లక్ష్మణ్‌రావు, సోయం ఈశ్వర్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ఆదివాసీ ప్రజలు పాల్గొన్నారు.
