హుజూర్‌నగర్ పీఆర్టీయూ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
అధ్యక్షుడిగా గొట్టే శ్రీనివాస్.. ప్రధాన కార్యదర్శిగా నిమ్మనగంటి నరసయ్య
నూతన కమిటీకి అభినందనలు తెలిపిన జిల్లా నాయకత్వం
హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : హుజూర్‌నగర్ మండల పీఆర్టీయూ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా గొట్టే శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా నిమ్మనగంటి నరసయ్య, అసోసియేట్ అధ్యక్షుడిగా కొప్పుల బ్రహ్మారెడ్డి, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా ఎం. షర్మిలకుమారి ఎన్నికయ్యారు.
ఉపాధ్యక్షులుగా సిరికొండ వెంకటయ్య, మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎస్. వీరమ్మ, కార్యదర్శులుగా జెల్లా సత్యనారాయణ, కీత శ్రీనివాస్, ఎం.డి. నజీమా అంజుమ్, చడపంగు జయమ్మ ఎన్నికైనట్లు పీఆర్టీయూ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు తంగెళ్ల జితేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తీగల సురేష్ తెలిపారు.
నూతనంగా ఎన్నికైన పీఆర్టీయూ హుజూర్‌నగర్ మండల కమిటీ సభ్యులకు జిల్లా నాయకులు అభినందనలు తెలిపారు. రెండేళ్ల పదవీకాలంలో చక్కటి పనితీరు కనబరిచి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సంఘానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పీఆర్టీయూ సంఘాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లేలా సమష్టిగా పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
