నూతన డీఈవోను కలిసిన యూటీఎఫ్ నాయకులు
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: పశ్చిమగోదావరి జిల్లా నూతన జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఓవియస్ అనిల్ కుమార్ యూటీఎఫ్ పశ్చిమగోదావరి జిల్లా కమిటీ సాదర స్వాగతం పలికింది. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో నూతన డీఈవోని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిలు పీఎస్ విజయరామరాజు, పోలిశెట్టి క్రాంతి కుమార్, జిల్లా కమిటీ కలిసి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లాలో విద్యాశాఖను ప్రగతి పథంలో నడిపించాలని, సుహృద్భావ వాతావరణం కల్పించాలని కోరారు.జిల్లా విద్యాశాఖలో విద్యారంగ వికాసం పాఠశాల అభివృద్ధి విద్యా ప్రమాణాల మెరుగుదలకు పశ్చిమగోదావరి జిల్లా కమిటీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు సీహెచ్ పట్టాభిరామయ్య, సహ అధ్యక్షులు కే. రాజశేఖర్, కోశాధికారి పి.శివప్రసాద్, జిల్లా కార్యదర్శులు ఎస్.రత్నరాజు, టీజే జయకుమార్, జి. రామకృష్ణంరాజు, కే. శ్రీ రామకృష్ణ, ప్రసాద్ రాష్ట్ర కౌన్సిలర్లు పిల్లి శ్రీనివాసరావు, ఎం. వనజాక్షి, మండల పట్టణ శాఖల నాయకులు కే. త్రిమూర్తులు, కే. వామన, మూర్తి , కేవీ మల్లేశ్వర రావు, బి. నరేష్, హెచ్. రమేష్, ఏ. రాంబాబు, విక్రం, బి నాగబాబు ,ఏం నరసింహయ్య, జి ప్రకాష్ రావు, కే పెద్దిరాజు, ఎం శివరామరాజు, జీడి భవాని ప్రసాద్, కే. సూర్య, జి. సుధాకర్, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
