కడెం నీటి విడుదలకై రాస్తారోకో..

తపాల్ పూర్ రైతుల నిరసన..

జన్నారం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాల్వ ద్వారా వెంటనే సాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని తపాల్ పూర్ పలువురు రైతులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా గ్రామ సీనియర్ రైతు కమ్మల విజయ ధర్మ, పలువురు రైతులు మాట్లాడుతూ.. వెంటనే ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగు నీటిని విడుదల చేయాలన్నారు.

మండలంలో రైతులు వేసుకున్న వరి నారు ఎదుగినందున నాట్లు వేసేందుకు ఆలస్యం అవుతుందని ప్రాజెక్టు నీటిపారుదల శాఖ అధికార్లు సాగునీటిని విడుదల చేసి ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువు రైతులు పాల్గొన్నారు.