చౌటుప్పల్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతల స్వీకరణ
ప్రజలకు వేగవంతమైన న్యాయ సేవలు అందిస్తా: జడ్జి శాలిని
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ న్యాయస్థానంలో నూతనంగా నియమితులైన జూనియర్ సివిల్ జడ్జి శాలిని గురువారం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కోర్టు అధికారులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఆమెకు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం జూనియర్ సివిల్ జడ్జి శాలిని కోర్టు పరిపాలన, పెండింగ్ కేసుల పరిష్కారం, న్యాయ సేవల సమర్థవంతమైన నిర్వహణకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నిష్పాక్షిక న్యాయ సేవలు అందించేందుకు కట్టుబడి పనిచేస్తానని జడ్జి శాలిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాడూరు పరమేష్, జనరల్ సెక్రటరీ పడమటి మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు పిట్టల భిక్షమయ్య, జాయింట్ సెక్రటరీ మక్తాల నర్సింహా, ముత్యాల సత్తిరెడ్డి, రాధాకిషన్ రావు, కానుగుల వెంకటయ్య, బాల్యం చలపతి, ఊడుగు శ్రీనివాస్, ఎలామోని శ్రీనివాస్, రిక్కల సుధాకర్ రెడ్డి, రాపోలు వేణు, జక్కర్తీ శేఖర్, ఖయ్యుమ్ పాషా, శ్రీశైలం, జ్యోతి, కిరణ్, భరత్, పాల పరమేష్, ఐతగొని శ్రీకాంత్, రాఘవేంద్ర, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, కోర్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
