ఈద్గా అభివృద్ధి కి రూ.20 లక్షలు కేటాయించండి…
మంత్రిని కోరిన బ్రాహ్మణ కొట్కూరు మత పెద్దలు
నందికొట్కూరు , ఆంధ్రప్రభ : మండల పరిధిలోని బ్రాహ్మణ కొట్కూరు గ్రామంలో ముస్లిం, మైనార్టీల కొరకు ఈద్గా అభివృద్ధి కి నిధులు కేటాయించాలని గ్రామ ముస్లిం, మైనార్టీ మత పెద్దలు శుక్రవారం నంద్యాలలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ ను కలిశారు.
నందికొట్కూరు టీడీపీ ఇంచార్జ్ గౌరు వెంకటరెడ్డి సహకారం తో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సహాయం తో బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో ఈద్గా అభివృద్ధి కి నిధులు కేటాయించాలని నంద్యాల లో మైనారిటీ మంత్రి ఫరూక్ ను శుక్రవారం కలిశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రాహ్మణ కొట్కూరు గ్రామ మత పెద్దలు, గ్రామ పెద్దలు, ముస్లిం సహోదరుల కలిసి ఈద్గా అభివృద్ధి కొరకు రూ.20 లక్షలు కోరినట్లు వారు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో బ్రాహ్మణ కొట్కూరు సింగిల్ విండో చైర్మన్ మద్దూరు హరి సర్వోత్తమ రెడ్డి, ముస్లీం, మైనార్టీ మత పెద్దలు పాల్గొన్నారు.
