మీ ఉదయానికి శక్తినివ్వండి..

ఆంధ్రప్రభ, ఆరోగ్యం : ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో, రోజును సమతుల్యమైన అల్పాహారంతో ప్రారంభించడం ఎంతో ముఖ్యమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం వేళల్లో సమయం లేకపోవడం వల్ల చాలా మంది అల్పాహారం మానేయడం లేదా పోషక విలువలు తక్కువగా ఉన్న ఆహారాన్ని ఎంచుకుంటుంటారు. అయితే అల్పాహారంలో కాలిఫోర్నియా బాదాన్ని చేర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు సులభంగా అందుతాయని నిపుణులు చెబుతున్నారు.

కాలిఫోర్నియా బాదంలో ప్రోటీన్, పీచు పదార్థం, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, విటమిన్–ఇతో పాటు మొత్తం 24 రకాల పోషకాలు ఉంటాయి. అలాగే జీర్ణకోశ ఆరోగ్యానికి తోడ్పడే పాలీఫెనాల్స్ కూడా ఇందులో సమృద్ధిగా లభిస్తాయి. విటమిన్–ఇ, జింక్, ఐరన్, కాపర్ వంటి పోషకాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వుల కలయిక ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేసి బరువు నియంత్రణకు కూడా దోహదపడుతుంది.

మ్యాక్స్ హెల్త్‌కేర్ రీజినల్ హెడ్ (డయటెటిక్స్) రితికా సమద్దర్ మాట్లాడుతూ, రోజులో తీసుకునే మొదటి ఆహారమే శరీరానికి అవసరమైన పోషకాల పునాది వేస్తుందని తెలిపారు. బిజీ జీవనశైలి కారణంగా అల్పాహారం మానేయడం మంచిది కాదని, పోషక విలువలు అధికంగా ఉన్న ఆహారంతో రోజును ప్రారంభిస్తే శక్తి స్థాయిలు నిలకడగా ఉండటంతో పాటు మొత్తం ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలి అంటే కఠినమైన డైట్‌లు కాదని, ప్రతిరోజూ పాటించగల చిన్న చిన్న మంచి అలవాట్లేనని చెప్పారు. సమతుల్య అల్పాహారం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందడంతో పాటు దీర్ఘకాలిక ఆరోగ్యానికి బలమైన పునాది ఏర్పడుతుందని వివరించారు.

నటి సోహా అలీ ఖాన్ కూడా తన రోజువారీ అల్పాహారంలో కాలిఫోర్నియా బాదం తప్పనిసరిగా ఉంటుందని తెలిపారు. ఇంట్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా సులభంగా తీసుకెళ్లే వీలుండటం, పోషకాలు అధికంగా ఉండటం వల్ల వాటిని క్రమం తప్పకుండా తీసుకుంటానని చెప్పారు. ప్రతిరోజూ చేసే చిన్న చిన్న ఆరోగ్యకరమైన ఎంపికలే దీర్ఘకాలిక ఆరోగ్యానికి కీలకమని ఆమె అభిప్రాయపడ్డారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాలిఫోర్నియా బాదాన్ని పాలు, ఓట్స్, పెరుగు, పండ్లు లేదా ఇతర అల్పాహార పదార్థాలతో కలిపి తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు సులభంగా అందుతాయి. చిన్న మార్పులతోనే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని వారు సూచిస్తున్నారు.