ప్రజలకు వారధిగా ఉండాలి..

  • టీడీపీ శ్రేణులకు ఎమ్మెల్యే బొండా ఉమా పిలుపు.

పాయకాపురం, ఆంధ్రప్రభ : ఇంటింటికి తెలుగుదేశంను ప్రజా ఉద్యమంగా చేపట్టి విజయవంతం చేయాలని, ప్రతి ఇంటికీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ వారధిగా ఉండాలని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మంగళవారం సింగ్ నగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో శ్రేణులకు పిలుపునిచ్చారు.మై టీడీపీ యాప్‌లో ప్రతి ఇంటి వివరాలు నమోదు చేయాలని బొండా ఉమా అన్నారు.స్థానిక 63వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన, మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల వంటి అంశాలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో 63వ డివిజన్ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం దుర్గా, ప్రధాన కార్యదర్శి కోలా శ్రీను, ఇంచార్జ్ మోత్కూరి కాసిం, పైడి శ్రీను, మోదుగుల గణేష్, బెజ్జం జైపాల్,దుర్గాసి రాము, ఎస్ కె మెహరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.