ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్..

మిర్యాలగూడ, ఆంధ్రప్రభ : ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు మంగళవారం మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారిని శారీరకంగా, మానసికంగా వేధించారనే ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఆ కేసు దర్యాప్తులో భాగంగా మిర్యాలగూడలో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.