ఇద్దరు విద్యార్థినులు పరారీ..!
కస్తూరిబా పాఠశాలలో కలకలం..
నకరికల్లు, జులై 28 (ఆంధ్రప్రభ ) : నకరికల్లు మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం నుంచి ఇద్దరు విద్యార్థినులు మంగళవారం పాఠశాల ప్రహరీ గోడ దూకి పారిపోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. గత 5 సంవత్సరాలుగా ఈ పాఠశాలలోనే చదువుకుంటున్న ఇంటర్మీడియట్ విద్యార్థినీలు పాఠశాల గోడ దూకి బయటకు వెళ్లిపోయారు.
బాలికలు కనిపించకపోవడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వెంటనే నకరికల్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాఠశాల సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థినుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
