పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్టు

​నకరికల్లు, ఆంధ్రప్రభ: పల్నాడు జిల్లా నకరికల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణలో భాగంగా గ్రామ శివారులోని ఎస్సీ కాలనీ చర్చి సమీపంలోని ఖాళీ స్థలంలో కోతముక్క పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ కే. సతీష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సోమవారం సాయంత్రం ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతుండగా వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న నగదు, పూల్ మొత్తంతో కలిపి మొత్తం రూ.5,770 నగదును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 52 పేకముక్కలను మరియు 3 మొబైల్ ఫోన్లను కేసు దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు.

​ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ గేమింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టారు. ప్రజలు జూదం మరియు కోతముక్క పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఇటువంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.