డా. ఏపీజే అబ్దుల్ కలాంకు ఘన నివాళులు..

అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ వైసీపీ కార్యాలయంలో భారత రత్న మాజీ రాష్ట్రపతి డా. ఏ.పి.జె అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశానికి ఆ మహానీయుడు అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు సింహాద్రి వెంకటేశ్వరరావు, అవనిగడ్డ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేపల్లె శ్రీనివాసరావు, కృష్ణాజిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీల విభాగం అధ్యక్షులు మద్ది వెంకటనారాయణ(చిన్న), అవనిగడ్డ కో-ఆప్షన్ సభ్యులు షేక్ నజీర్ భాషా, యడ్లంక మాజీ సర్పంచ్ సైకం బాబురావు, కృష్ణాజిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం కార్యదర్శి సామర్ల రాముడు, అవనిగడ్డ గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ కోడూరు సత్యనారాయణ, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ ఖాదర్ వలీ, మొఘల్ హుస్సేన్, షేక్ రియాజ్ భాష మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.