సీఎం ఖమ్మం జిల్లా.. పర్యటన వాయిదా..!

  • మరో తేదీని త్వరలో వెల్లడించనున్న అధికారులు

ఖమ్మం ఉమ్మడి బ్యూరో – ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా పడింది. ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గ పరిధి కొనిజర్ల మండలం అంజనాపురం వద్ద నిర్మాణం పూర్తి చేసుకున్న గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఈనెల 20న ఉదయం 11 గంటలకు సీఎం ప్రారంభించాల్సి ఉంది.

శనివారం సాయంత్రం కొణిజర్ల మండలం తో పాటు ఖమ్మం జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురవడం, మరో రెండు రోజులు వర్షాలు పడనున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో సీఎం పర్యటన వాయిదా వేశారు. మరో తేదీని రెండు రోజుల తర్వాత అధికారులు ప్రకటించనున్నారు. ఈనెల 10న మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాధపురం వద్ద సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా బహిరంగ సభ పెద్ద ఎత్తున రైతులతో జరిగిన విషయం తెలిసిందే.