భూ కబ్జా కోసం షెడ్డు కూల్చివేత..
అధికార పార్టీ నేతపై చర్యలు కోరిన బాధితుడు
బెల్లంపల్లి రూరల్, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి మండలంలోని ఐటీడీఏ నర్సరీ ఎదురుగా ఉన్న భూదాకలాన్ శివారులో సర్వే నంబర్ 170/ఏ1లో తనకు చెందిన భూమిలో నిర్మించుకున్న షెడ్డును భూ కబ్జా చేసేందుకు అధికార పార్టీకి చెందిన వెంకటేష్ రాత్రికి రాత్రే కూల్చివేశాడని బాధితుడు కోయిల్కార్ గోవర్ధన్ ఆరోపించారు.
ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే పీఏ ఇక్బాల్‌కు వినతిపత్రం అందజేశారు. సర్వే నంబర్ 170/ఏ1లో తనకు 22 గుంటల భూమి పూర్వకాలం నుంచి ఉందని, తానే సాగు చేసుకుంటూ ఆధీనంలో ఉంచుకున్నానని వినతిపత్రంలో పేర్కొన్నారు.
తన భూమిని ఆక్రమించేందుకు షెడ్డును ధ్వంసం చేశారని, ఈ ఘటనపై మండల తహసీల్దార్‌తో పాటు తాళ్లగురిజాల ఎస్సైకు కూడా వెంకటేష్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనకు న్యాయం చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పీఏను కోరారు.
