ఈదురు గాలులతో అకాల వర్షం.. చల్లబడ్డ వాతావరణం

ఈదురు గాలులతో అకాల వర్షం.. చల్లబడ్డ వాతావరణం
ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో ఈ రోజు సాయంత్రం ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం చిరుజల్లులు పడ్డాయి.
హస్నాపూర్ ఎక్స్ రోడ్ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం కురువగా ఉట్నూర్ తదితర గ్రామాల్లో ఈదురుగాలతో కూడిన చిరుజల్లులు కురిసాయి దీంతో ఉదయం నుండి సాయంత్రం వరకు తీవ్ర ఎండలతో ప్రజలు ఇబ్బందులు పడగా సాయంత్రం వేళ ఒకేసారి వాతావరణంలో మార్పులు ఏర్పడి ఈదురుగాళ్లు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడి వేడిమితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కొంత మేరకు ఉపశమనం కలిగింది.
