Cm-Cbn-Serious : ఎవ్వరినీ వదలం Andhra Prabha Top News
Cm-Cbn-Serious : ఎవ్వరినీ వదలం Andhra Prabha Top News
- తప్పు చేస్తే. సహించం
- గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తోంది
- సోషల్ మీడియాను వాడుతోంది
- తప్పుడు ప్రచారం చేస్తోంది
- 2024 ఎన్నికల్లో జనం ఊడ్చేశారు
- బూతులు తిట్టినోళ్లను ఓట్లతో కడిగేశారు
- ఇంకా బుద్ధిరాలేదు
- గేడివాడలో సీఎం సీబీఎన్
(ఆంధ్రపభ , గుడివాడ ప్రతినిధి)

చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకునేందుకు వీల్లేదు.
తప్పు చేసింది పరాయి పార్టీ వాడైనా మా పార్టీ వ్యక్తి అయినా మా ప్రభుత్వానికి ఒక్కటే, కఠిన చర్య తప్పదు, అని ఏసీ సీఎం చంద్రబాబు నాయుడు స్ఫష్టం చేశారు, గుడివాడలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్టాడుతూ, గత ప్రభుత్వ పాలనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక వైపీసీని ఏకిపారేశారు. గత పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. ప్రజలు సంతోషంగా గడిపిన పరిస్థితి లేదు. 2024 ఎన్నికల్లో ప్రజలు రాజకీయ చెత్తను శుభ్రం చేశారుబూతులు తిట్టిన వారి నోళ్లను ఓట్లతో కడిగేశారు. రాజకీయాల్లో క్రిమినల్స్ ఇంకా కొనసాగిస్తున్నారు. కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెడుతూ అందరినీ హింసిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులపై పోస్టుల గురించి అడిగితే భావ ప్రకటనా స్వేచ్ఛ అంటున్నారుప్రజల జీవితాలకు ఆటంకాలు కలిగించి వారి జీవితాలతో ఆడుకుంటామంటే సహించేది లేదుశ్రీకాకుళంలో గొర్రెల కాపరిని గొడ్డలి పార్టీ నాయకుడి కొడుకు బైక్ తో గుద్దేసి చంపేశారు. చనిపోయిన పేదకుటుంబంలోని వారిని ఆదుకోకుండా వారిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు కొడుకుపై కేసు పెట్టకుండా తప్పించేందుకు ఏకంగా సాక్షాలను, మనిషినే తారుమారు చేశారు. గొడ్డలిపార్టీ మాట్లాడితే రప్పా రప్పా అంటోంది. పోస్టర్లకు పొట్టేళ్లను బలి ఇచ్చి రక్త తర్పణం చేస్తున్నారు గుంటూరులో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన తగాదాలో మా పార్టీ కార్యకర్త ఓ మహిళ పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారు తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేసి అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకున్నాను.ఉదాసీనంగా వ్యవహరించిన అధికారులను కూడా బదిలీ చేస్తున్నాం.అని సీఎం వివరించారు. .
Cm-Cbn-Serious : కృష్ణాడెల్డాకు గోదారి నీళ్లిచ్చాం

ఇంటి నుంచి చెత్త రాకుండా నెట్ జీరో అన్నది మన విధానం కావాలని పిలుపునిస్తున్నాను. కార్బన్ న్యూట్రల్స్ అనే కొత్త విధానం మనకు అలవాటు కావాలి ఇంటిపై పడిన వర్షాన్ని భూగర్భజలాల కింద మార్చుకోవాలి. 12 ఏళ్లకు ముందు కృష్ణాడెల్టాకు నీటి ప్రవాహాలు తగ్గిపోయాయి. దేశానికి అన్నపూర్ణగా నిలిచిన కృష్ణా జిల్లా నీటి ప్రవాహాలు లేక సతమతం అయ్యిందిఅందుకే 12 నెలల్లో పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి డెల్టాకు గోదావరి నీళ్లు తెచ్చాంఈసారి 48 శాతం వర్షపాతం లోటు ఉంది. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీళ్లు రావటం లేదు కానీ పట్టిసీమ నుంచి నీరు తరలిస్తూ డెల్టాకు నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం. 450 టీఎంసీల మేర నీళ్లు ఇప్పటి వరకూ తెచ్చాం.
Cm-Cbn-Serious : రూ.50వేల కో్ట్ల సంపద సృష్టించాం

దాదాపు 50 వేల కోట్ల సంపద సృష్టించాం చాలా మంది ఈ ప్రాజెక్టు చేయనీయకుండా అడ్డుకున్నారు కానీ నెనెక్కడా వెనుకడుగు వేయలేదు . పోలవరం పూర్తి చేసి గ్రావిటీ ద్వారా డెల్టాకు నీరు తేస్తాంవంశధార నుంచి పెన్నా వరకూ నదుల్ని అనుసంధానించి కరువు లేకుండా చేస్తాం వర్షాన్ని భూగర్భజలాలుగా మార్చుకునేలా ప్రజలు ప్రయత్నించాలి. అని సీఎం సూచించారు. .
Cm-Cbn-Serious : ఆక్వా రైతులను ఆదుకుంటాం

నీరు లేకపోతే మన దగ్గర ఆక్వా పరిశ్రమ ఎక్కడిది. ప్రస్తుతం వేర్వేరు కారణాల వల్ల రొయ్య ధరలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రొయ్యల మేత ధరలు కూడా పెరుగుతున్నాయి. వీటిపై కేంద్రంతో ఇప్పటికే మాట్లాడాను ఈ ప్రాంతంలోని అక్వా పరిశ్రమలను ఎట్టిపరిస్థితుల్లోనూ కాపాడతాం రూ.1.50 యూనిట్ చొప్పున విద్యుత్ ఇస్తున్నాం కాలుష్యం లేకుండా చూడాలి. అప్పుడే దిగుబడి, నాణ్యత కూడా పెరుగుతుంది ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ లను కూడా దృష్టిలో ఉంచుకుని రైతులు సాగు చేయాలని కోరుతున్నాను ప్రపంచవ్యాప్తంగా తినే ఆహారపదార్ధాలను పరీక్షిస్తున్నారు. అందుకే ప్రకృతి సేద్యం దిశగా మనం ఆలోచనలు చేయాలి. పీఎం కిసాన్ కింద ఏటా 20 వేలు ఖాతాల్లో వేస్తున్నాం , పొగాకు రైతులను కూడా ఆదుకునేలా చర్యలు తీసుకుంటాం, అని రైతులకు సీఎం భరోసా ఇచ్చారు.
Cm-Cbn-Serious : నాలుగైదు రోజుల్లోనే తల్లికివందనం
ఆర్ధిక ఇబ్బందులను అధిగమిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేలా అడుగులు ముందుకేస్తున్నాంఈ నెల 22-24 తేదీ వరకూ తల్లికి వందనం కార్యక్రమం కింద ఖాతాల్లో డబ్బులు వేస్తాం , నా దగ్గర డబ్బులు కాదు పేదల పక్షాన ఆలోచించే మనసుంది
ఆంగన్వాడీలు, స్వచ్ఛాంధ్ర కింద పనిచేసే వారికి కూడా తల్లికి వందనం ఆర్ధిక సాయం అందిస్తాం .తల్లికి వందనం కింద 67.47,197 మంది విద్యార్ధులకు రూ,10,122 కోట్ల మొత్తాన్ని తల్లుల ఖాతాలకు జమ చేస్తాం, అని సీఎం హామీ ఇచ్చారు.
Cm-Cbn-Serious : ఎన్డీఆర్ స్ఫూర్తితో…
ఎన్టీఆర్ తొలిసారి ప్రజాక్షేత్రంలో నిలబడిన ప్రాంతం ఇది.స్వచ్ఛమైన రాజకీయాలు, స్వచ్చమైన ప్రజాప్రతినిధులు, స్వాభిమానం అనే అంశాలపై ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. గతంలో స్వార్ధ రాజకీయాలు మాత్రమే ఉన్న పరిస్థితిని మార్చి అభివృద్ధి, సంక్షేమాన్ని తీసుకువచ్చారు. అదే స్సూర్తితో అర్హులందరికీ సంక్షేమం, రాష్ట్రంలో అభివృద్ధి, ఉపాధి ఉద్యోగాలు, సంపద సృష్టించేలా పాలన అందిస్తున్నాం రోడ్లు ఊడ్చటం ఒక్కటే పరిశుభ్రత కాదు, పర్యావరణం, ప్రజల ఆరోగ్యం మెరుగ్గా ఉండాలి, అని సీఎం సూచించారు.
Cm-Cbn-Serious : అప్పటి చెత్తను తీసేశాం
గత పాలనలో చెత్తాచెదారం నింపేసిన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు పరిశుభ్రంగా తీర్చిదిద్దాం. మన జన్మ స్థలాన్ని చెత్తలేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్న ఆలోచనతో మనం పనిచేయాలి. ప్రభుత్వానికి ప్రజలు సహకరిస్తేనే స్వచ్ఛతా లక్ష్యం సాధ్యం అవుతుంది. పచ్చదనం, పరిశుభ్రత ఉంటేనే మన లక్ష్యాన్ని సాధించగలం.శాంతిభద్రతలు, సంక్షేమం, ఆదాయంతో మెరుగైన జీవన ప్రమాణాలు ప్రజలకు ఉంతెడాలన్నదే మా లక్ష్యం,సీఎం చంద్రబాబు వివరించారు.
Cm-Cbn-Serious : తెలుగు జాతి రక్షణ మా బాధ్యత
తెలుగు జాతి భవిష్యత్తును రక్షించే బాధ్యత నేను తీసుకున్నాను.
పూర్తి పారదర్శకంగా సుపరిపాలన అందిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి సహించబోం . మన ప్రజా రాజధాని అమరావతిని కాపాడుకునేలా ప్రతీ ఒక్కరూ స్పూర్తిగా పనిచేయాలి, గతంలో జన్మభూమి పిలుపు ఇచ్చినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వచ్చి పనిచేశారు. ఇదే స్పూర్తి కొనసాగాలి , 120 పట్టణ ప్రాంత స్థానిక సంస్థల కింద రూ.15,274 కోట్లతో వివిధ పనులకు శంకుస్థాపనలు చేశాం ప్రజారోగ్య మున్సిపల్ ఇంజనీరింగ్ కింద ఈ పనులు చేపడుతున్నాం. మురుగునీటి శుద్ధికి సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు, మంచినీటికి ఓవర్ హెడ్ ట్యాంకులు, చెరువులు పునరుద్ధరణ, డ్రైనేజి లాంటి పనుల కోసం వీటిని చేపడుతున్నాం, అని సీఎం స్నష్టం చేశారు.
Cm-Cbn-Serious : త్వరలొ 1104 ఈ ఆటోలు తెస్తార
సురక్షితమైన తాగునీరు, మెరుగైన పారిశుధ్ద్య వ్యవస్థ తీసుకురావాలన్నదే మా ఆలోచన ఇంటింటికీ చెత్త సేకరణ కోసం 126 ఎలక్ట్రిక్ ఆటోలను ప్రారంభించుకున్నాం. త్వరలో 1104 ఇ-ఆటోలు కూడా అందుబాటులోకి వస్తాయి. 528 కోట్లతో వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం చెత్త నుంచి విద్యుత్ తయారు చేసేలా రాష్ట్రంలో 8 ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతీ ఇంటిలోనూ వ్యర్ధాల వర్గీకరణ మొదలు పెట్టాలని ప్రజలను కోరుతున్నాను.
స్వచ్ఛ రథం పేరిట వ్యర్ధాలను సేకరిస్తూ రూ.16కోట్లను ఖర్చు చేసి నిత్యావసర సరుకులు ఇచ్చాం
Cm-Cbn-Serious : చెత్త రహిత ఏపీగా మారుప్తాం
గత పాలకులు చెత్తను రోడ్లపై గుట్టలు గుట్టలుగా పేర్చి వదిలేశారు. ఈ కారణంగా భూగర్భజలాలు కాలుష్యం బారినపడ్డాయి. గత పాలకులు వదిలేసిన 140 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించాం. అక్టోబరు 2 తేదీనాటికి చెత్త రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దుదాంస్వచ్ఛ పథం కార్యక్రమం ద్వారా రహదారులు, పరిసరాలను శుభ్రం చేస్తున్నాం
ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా స్వచ్ఛమైన పట్టణ ప్రాంతాలు, ప్రజల భాగస్వామ్యం కోసం కార్యక్రమం చేపట్టాం. అని సీఎం వివరించారు.
