శాంతిభద్రతలకు ప్రజల సహకారం అవసరం
గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
అపరిచిత వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని బిక్కనూర్ ఎస్సై అనిల్ సూచన
బిక్కనూర్, ఆంధ్రప్రభ : శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని బిక్కనూర్ ఎస్సై అనిల్ పేర్కొన్నారు. పోలీసులకు ప్రజలు సహకరిస్తే నేరాల నియంత్రణ మరింత సులభమవుతుందని తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగన్నగారి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఎస్సై అనిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
సీసీ కెమెరాల ఏర్పాటుతో దొంగతనాలను అరికట్టడంతో పాటు నేరాల దర్యాప్తులో కూడా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు వచ్చినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. గ్రామస్తులు ఐక్యంగా ఉంటూ తమ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బస్వాపూర్ సొసైటీ డైరెక్టర్ మల్లారెడ్డి, రైతు కమిటీ సభ్యుడు మల్లారెడ్డి, నాయకులు భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
