కొలువుదీరిన వలిగొండ పీఏసీఎస్ నూతన పాలకవర్గం

వలిగొండ (ఆంధ్రప్రభ): వలిగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నూతన పాలకవర్గం గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించింది. చైర్మన్‌గా గరిసె రవి, వైస్ చైర్మన్‌గా జక్కా జంగారెడ్డి బాధ్యతలు చేపట్టారు. అలాగే డైరెక్టర్లుగా బత్తిని లింగమ్మ, ఎమ్మె మల్లేశం, బూడిద పద్మ, కట్ట లింగస్వామి, గూడూరు మోహన్‌రెడ్డి, వనగంటి జహంగీర్, బుగ్గ బీరప్ప, కలకూరి చంద్రయ్య, బర్ల నర్సింహ, బంగారి మహిపాల్, వనం నర్సింహ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా చైర్మన్ గరిసె రవి మాట్లాడుతూ, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తమపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమం, సహకార సంఘ అభివృద్ధే లక్ష్యంగా పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలందిస్తూ సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

నూతన పాలకవర్గ సభ్యులకు వలిగొండ ప్రాంత ప్రజాప్రతినిధులు, సహకార సంఘ సభ్యులు, రైతులు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి పదవీకాలం విజయవంతంగా సాగి రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.