కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరికి బ్రెయిన్ స్ట్రోక్

హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు
24 గంటలపాటు ప్రత్యేక పర్యవేక్షణ

విజయవాడ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరికి గురువారం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయనను హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు వెంటనే అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించినట్లు సమాచారం. శస్త్రచికిత్స అనంతరం బ్రహ్మం చౌదరిని ఐసీయూలో ఉంచి వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తదుపరి 24 గంటలపాటు నిశితంగా గమనించనున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉన్నప్పటికీ, పూర్తి వివరాలు వైద్యుల పరిశీలన అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ వార్త తెలియడంతో రాజకీయ, సామాజిక వర్గాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బ్రహ్మం చౌదరి అనారోగ్యానికి గురికావడం పట్ల సన్నిహితులు విచారం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మం చౌదరి త్వరగా కోలుకుని ప్రజాసేవలో తిరిగి చురుకుగా పాల్గొనాలని పలువురు నాయకులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.