ఎమ్మెల్యే కార్యాలయంలో ముద్రగడ పద్మనాభంకు ఘన నివాళి
అవనిగడ్డ (ఆంధ్రప్రభ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం మృతికి సంతాపం తెలుపుతూ బుధవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. ముద్రగడ చిత్రపటానికి నియోజకవర్గ యువనేత మండలి వెంకట్రామ్, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మత్తి వెంకటేశ్వరరావు, టీడీపీ, జనసేన మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, గుడివాక శేషుబాబు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం ప్రజా జీవితంలో చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ యలవర్తి చిన్నా, ఎంపీటీసీ సభ్యుడు బొప్పన భాను, డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథప్రసాద్, లంకమ్మ దేవస్థానం మాజీ చైర్మన్లు అన్నపరెడ్డి రామదాసు, యాసం శ్రీరాములు, ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి, జనసేన, టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
