15మంది విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
సురక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
విజయవాడ, జులై 15 ( ఆంధ్రప్రభ): సురక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ గాయత్రీనగర్‌లో 15మంది విద్యార్థులకు రూ.1.50లక్షల విలువైన సైకిళ్లను పంపిణీ చేశారు. మెడ్‌ప్లస్ సంస్థ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ కె.వి. నరసయ్య, ఫౌండేషన్ ప్రతినిధి కె.సమత, మెడ్‌ప్లస్ ప్రతినిధి సాయి తేజ పాల్గొని విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు.
ఈసందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ… ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు విద్యాభ్యాసాన్ని నిరాటంకంగా కొనసాగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సమాజ సేవలో భాగంగా భవిష్యత్తులో కూడా విద్యార్థుల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.
