నిరుపేద ఆడబిడ్డలకు ప్రజాపాలన ప్రభుత్వం అండ

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

చిట్యాల, ఆంధ్రప్రభ: నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ప్రజాపాలన ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా అండగా నిలుస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్‌ఆర్) అన్నారు.

మంగళవారం చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మండలానికి చెందిన 51 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. వీరిలో 49 మందికి కళ్యాణలక్ష్మి, ఇద్దరికి షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు వివాహాలకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వసంతరావు, ఆర్‌ఐ రాజేందర్, గ్రామ సర్పంచ్ తవుటం లక్ష్మి, కాంగ్రెస్ జిల్లా, మండల నాయకులు ముకిరాల మధు, వంశీకృష్ణ, పులి తిరుపతిరెడ్డి, చిలుకల రాయ కొమురు, గంగాధరి రవీందర్, గుర్రపు తిరుపతి, అల్లం రాజుతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.