మహిళ రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం తగదు

మహిళ రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం తగదు
- చిట్యాలలో రాహుల్ గాంధీ చిత్రపటాలతో బీజేపీ నిరసన
చిట్యాల, ఆంధ్రప్రభ : పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం తగదని బిజెపి చిట్యాల మండలాధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో రాహుల్ గాంధీ చిత్రపటాలలతో నిరసన ,ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోడీ మహిళ రిజర్వేషన్ బిల్లు తీసుకురావడంచారిత్రాత్మకమైననిర్ణయమని, దశాబ్దాలుగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారాధ్యంలో బిల్లు ప్రవేశపెడితే, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అడ్డుకోవడం సిగ్గుచేటని అన్నారు.
72 కోట్ల మహిళా లోకం ఏకమై తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారని ఆయన అన్నారు. అనంతరం రాహుల్ గాంధీ చిత్రపటాలను తగులబెట్టే క్రమంలో సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చి అడ్డుకోవడం తోపాటు ధర్నా విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శిలు రావుల రాకేష్, మైదం శ్రీకాంత్, బిజెపి సీనియర్ నాయకులు గజనాల రవీందర్, గుండ సురేష్, కత్తుల ఐలయ్య, రాయిని శ్రీనివాస్, చింతల రాజేందర్, గుండ మణికుమార్, తదితరులు పాల్గొన్నారు.
