మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నరేష్ రెడ్డి నియామకం
లక్ష్మణచాంద,ఆంధ్రప్రభ: లక్ష్మణచాంద మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నరేష్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు, పార్టీ ఇన్‌ఛార్జి శ్రీహరి రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని నరేష్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన నియామకంపై మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
