నల్లగొండ డీసీసీ ప్రధాన కార్యదర్శి నియామకం
నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ: నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ప్రధాన కార్యదర్శిగా నల్లగొండ రూరల్ మండలం దోమలపల్లి గ్రామానికి చెందిన యాళ్ల రవీందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
యాళ్ల రవీందర్ రెడ్డి గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి సేవలందిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధిష్ఠానం డీసీసీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది.
తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు, మంత్రులు, పార్టీ నాయకత్వానికి రవీందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు. రవీందర్ రెడ్డి నియామకంతో దోమలపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
