ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదురుగా ధర్నా..
ర్యాలీ నిరసనలతో దద్దరిల్లిన కలెక్టరేట్ ప్రాంగణం
రెండేళ్ల తర్వాత ఉపాధ్యాయుల ఆవేదన.. ఉద్యమ రూపంలో..
నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : మా ప్రభుత్వం అనుకున్నాం ఎన్నికలలోఉపాధ్యాయులందరూ మా కుటుంబ సభ్యులు ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపించుకున్నాం. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేరలేదన్న రు. రెండు సంవత్సరాలయింది అధికారంలోకి వచ్చి కనీసం ఉపాధ్యాయుల సమస్యలు ఏమాత్రం పట్టించుకోలేదని అందుకు నిరసనగా ప్రభుత్వంపై వ్యతిరేకతతో మంగళవారం జిల్లా నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా అన్ని సంఘాల నాయకులు ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా నిరసన ర్యాలీ పికెటింగ్ చేపట్టారు.
ఫ్యాప్టో పిలుపుమేరకు ఫ్యాప్టో చైర్మన్ ఎం. రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శ్రీనివాస నగర్ కాంప్లెక్స్ నుంచి బైక్ ర్యాలీలో శ్రీనివాస్ నగర్, టేక్కే ,సాయిబాబా నగర్, ఓవర్ బ్రిడ్జి మీదుగా, నూనెపల్లె దగ్గర ఓవర్ బ్రిడ్జి కింద నుంచి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు వందల సంఖ్యలో, ర్యాలీ చేసుకుంటూ నినాదాలు ఇచ్చుకుంటూ ,కలెక్టరేట్ వరకు చేరుకున్నరు.ర్యాలీ చేసి కలెక్టర్ కార్యాలయం ఎదురుగా పికటింగ్ చేశారు. రాష్ట్ర ఫ్యాప్టో కార్యవర్గ సభ్యులు హృదయ రాజు సురేష్ కుమార్ ఫ్యాప్టోచైర్మన్ రామచంద్రారెడ్డి సెక్రటరీ జనరల్ దస్తగిరి బాషా లు మాట్లాడరు.
ప్రభుత్వ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి 11వ పిఆర్సి అరియర్స్, 2022 నుంచి రావాల్సిన సరెండర్ లీవ్ ఎన్ కాస్మెంటు 30 శాతం ఐర్ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న ఐదు డీఏ లను విడుదల చేయాలన్నారు. పాత డీఏ బకాయిలను విడుదల చేయాలన్నారు.సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని 23 (1) కు పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసి టెట్ రద్దు చేయాలని లేని పక్షంలో ప్రత్యేక టెట్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఉపాధ్యాయులను బోధినేతర పనుల నుండి మినహాయించి బోధనకే పరిమితం చేయాలన్నారు.మునిసిపల్ ఉపాధ్యాయుల, కేజీబీవీ ఉపాధ్యాయుల, మోడల్ స్కూల్ లో పనిచేసే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలన్నారు. కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు.1998 ఎంటిఎస్ ఉపాధ్యాయుల సర్వీసును 62 సంవత్సరాల కు పెంచాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పి.వి.వరప్రసాద్, ఎస్. చంద్రశేఖర్, నగిరి శ్రీనివాసులు, కిరణ్ కుమార్ రెడ్డి, స్వామి శేఖర్, లక్ష్మణ్ నాయక్, రవికుమార్, కేవీ శివయ్య, ఆజాం బెగ్, సైఫుల్ల, సుధాకర్, శివ శంకర్ వందల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
