NEWS@05:00 P.M | 14 జూలై 2026 ముఖ్యాంశాలు
లిక్విడ్ గంజాయి ముఠా గుట్టురట్టు..
నర్సీపట్నంలో గంజాయిని లిక్విడ్ రూపంలోకి మార్చి హాషిష్ ఆయిల్గా సరఫరా చేస్తున్న ఐదుగురు యువకులను గొలుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో హాషిష్ ఆయిల్, గంజాయి, ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. click here to read full story
………………………………………………………………………………
ఏడుకొండలపై భక్తజన సందోహం.. శ్రీవారి దర్శనానికి 24 గంటలు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమల గిరులు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. ‘గోవిందా.. గోవిందా..’ నామస్మరణతో శేషాచలం మార్మోగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులతో తిరుమలలో మంగళవారం రద్దీ కొనసాగుతోంది. click here to read full story
………………………………………………………………………………….
జాప్యం వద్దు.. అభివృద్ధి ఆగద్దు..
ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ అనుసంధానం ద్వారా అవసరం లేని బిజినెస్ రూల్స్‌ను సంస్కరించుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్ రీ డ్రాఫ్ట్ చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసి సంస్కరణలు తీసుకురావాలని సీఎం నిర్దేశించారు. సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌరసేవలు, రాష్ట్రంలో యూరియా లభ్యతపై ముఖ్యమంత్రి సమీక్షించారు. click here to read full story
………………………………………………………………………………….
ఎడ్జ్‌బాస్టన్‌లో వన్డే సమరం.. రోహిత్, కోహ్లీ వచ్చేశారు.. !
టీ20 సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత ఇంగ్లండ్‌తో వన్డే సమరానికి టీమిండియా సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత్ ముందుగా బౌలింగ్ చేయనుంది. click here to read full story
………………………………………………………………………………….
’సిగ్మా’ సినిమా వాయిదా?
మిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉండగా.. విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా ‘సిగ్మా’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా జూలై 31న విడుదల కావాల్సి ఉంది. కానీ, తన తండ్రి విజయ్ ‘జననాయగన్’ సినిమాను దృష్టిలో పెట్టుకుని జేసన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. click here to read full story
………………………………………………………………………………….
కార్బెట్ అటవీ ప్రాంతంలో అరుదైన జీవి ప్రత్యక్షం..
త్తరాఖండ్‌లోని కార్బెట్ నేషనల్ పార్కు సమీప అటవీ ప్రాంతంలో అరుదైన ‘ఎగిరే ఉడత’ చాలా ఏళ్ల తర్వాత కనిపించింది. రామ్‌నగర్ అటవీ ప్రాంతంలోని టేడా గ్రామంలో ఓ గ్రామస్థుడి ఇంట్లోకి ప్రవేశించిన ఈ అరుదైన జీవిని అటవీశాఖ నిపుణులు సురక్షితంగా రక్షించారు. కార్బెట్ అటవీ ప్రాంతంలో అరుదైన జీవి ప్రత్యక్షం.. click here to read full story
………………………………………………………………………………….
టీటీడీ కొత్త దాతల విధానం.. సామాన్య భక్తులకే పెద్దపీట !
తిరుమలలో సామాన్య భక్తుల దర్శనానికి మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. దాతలకు కల్పిస్తున్న సౌకర్యాలను హేతుబద్ధీకరిస్తూ కొత్త దాతల విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు టీటీడీ ఈవో రవిచంద్ర వెల్లడించారు. click here to read full story
