కాంగ్రెస్ పాలనలో హోల్ సేల్ గా దోపిడీ
- సింగరేణి ముంచడంలో కెసిఆర్, రేవంత్ కు తేడా లేదు..
- కార్మికుల భవిష్యత్తు కోసం తాడిచర్ల కోల్ బ్లాక్
- సింగరేణి పై ప్రేమంటే 58 వేల కోట్ల బకాయిలు చెల్లించండి..
- కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి
గోదావరిఖని, (ఆంధ్రప్రభ): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలోని వనరుల దోపిడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు హోల్‌సేల్ గా దుకాణాలు తెరిచారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లోని గోదావరిఖని సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టును కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు కార్మికులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బొగ్గు గనుక ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్మికుల ఉద్దేశించి సుదీర్ఘంగా మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దోపిడి కోసం రిటైల్ షాపులను తెలిస్తే… మంత్రులు హోల్‌సేల్ దుకాణాలు తెరిచారని… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఏకంగా పెద్ద హోల్‌సేల్ దుకాణమే తెరిచారని మండిపడ్డారు. సింగరేణి బొగ్గు పరిశ్రమ మన ఆత్మగౌరవమని, తెలంగాణ కు బంగారుగనిగా వర్ధిల్లుతున్న సింగరేణి బిఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిలువునా దోపిడీ దోపిడీ చేశాయని మండిపడ్డారు. సింగరేణి సంస్థను టిఆర్ఎస్ కాంగ్రెస్ బంగారు బాతుల వాడుకుందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏకైక బొగ్గు పరిశ్రమ సింగరేణి సంస్థ అని… ఈ సంస్థ నుండి సరఫరా చేసే బొగ్గుతో దేశానికి వెలుగునిచ్చే విద్యుత్ పరిశ్రమలు ఏర్పడ్డాయని అలాగే స్టీల్ పరిశ్రమలు.. సిమెంట్ పరిశ్రమలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఎన్నో లాభాలను గడించిన సింగరేణి బొగ్గు సంస్థ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని నష్టాలను చదివి చూస్తుందని విమర్శించారు. బొగ్గు గాని కార్మికులకు జీతాలు ఇవ్వాలంటే బ్యాంకుల నుండి ఓడిని తీసుకొని వేతనాలు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు.

10 సంవత్సరాల కెసిఆర్ ప్రభుత్వ హాయంలో సింగరేణిని హరీష్ రావు కేటీఆర్ కవిత దోచుక తిన్నారని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా ఆరోపించారు.కెసిఆర్ మూలంగానే సింగరేణికి కొత్త కోల్ బ్లాక్స్ రాలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సింగరేణి పై ఏమాత్రం ప్రేమ ఉన్న బొగ్గు సంస్థకు బకాయి ఉన్న 58 వేల కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణిలో పనిచేస్తున్న 40 వేల మంది కార్మికుల ఆస్తి నాయిని కోల్‌బ్లాక్… తాడిచెర్ల కోల్ బ్లాక్ అని పేర్కొన్నారు. తాడిచెర్ల కూల్ బ్లాక్ సింగరేణికి ఒక బాహుబలి ప్రాజెక్టు అని… తాడిచెర్లలో 434 మిలియన్ టన్నుల బొగ్గు ఉందని అది పూర్తి నాణ్యమైన బుగ్గని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోని బొగ్గు ఆధారిత పరిశ్రమలకు సింగరేణి నుండి సరఫరా చేయాల్సిన బొగ్గును ఆటంకాలు లేకుండా సరఫరా చేయాలని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బిఎంఎస్ ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వెంకటేష్ నేత, బి ఎం ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య, నాయకులు కందుల సంధ్యారాణి, బలుమూరి వనిత, మెరుగు హనుమంత్ గౌడ్, సారంగపాణి, రావుల రాజేందర్, పిడుగు కృష్ణలు పాల్గొన్నారు.
