ఈ నెల 15న చల్లపల్లిలో విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక

చల్లపల్లి – ఆంధ్రప్రభ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈనెల 15వ తేదీ బుధవారు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు చల్లపల్లిలోని పెదకళ్ళేపల్లి రోడ్డులో గల వర్తక సంఘం ఫంక్షన్ హాల్ లో విద్యుత్ వినియోగదారుల అదాలత్ నిర్వహిస్తున్నట్లు విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.వి.సుధాకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సరఫరా లోపాలు, విద్యుత్ బిల్లులో తప్పులు తదితర సమస్యలపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్మన్ ఎన్.విక్టర్ ఇమ్మానియేల ఆధ్వర్యలో జరుగుతుందని సిజిఆర్ఎఫ్ సభ్యులు డి.కృష్ణ నాయక్, కె.కృష్ణ, ఏ.సునీత మరియు కృష్ణాజిల్లా విద్యుత్ పర్యవేక్షణ అధికారి పి.హరిబాబు కూడా హాజరవుతారని తెలిపారు. కృష్ణాజిల్లా పరిధిలోని ఉయ్యూరు డివిజన్ కు చెందిన విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చల్లపల్లి విద్యుత్ శాఖ డిఈఈ పి.రవి కుమార్ సూచించారు.