క్షేత్రస్థాయిలో కిల్కారి సేవలు అమలు తీరు పరిశీలన

చిట్టినగర్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం లోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మాతాశిశు మరణాలను తగ్గించేందుకు కిల్కారి మొబైల్ హెల్త్ సేవలు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకం కింద సుమారు రెండున్నర లక్షల మంది గర్భిణీ బాలింతలకు సేవలు అందించాలని లక్ష్యం గా పెట్టుకుంది. అందులో భాగంగా సోమవారం ఉదయం కొత్తపేట పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధి లోని గర్భిణీలు బాలింతలకు అందుతున్న కిల్కారి సేవలు గురించి తెలుసుకోవడానికి కిల్కారి రీజినల్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజు పర్యటించారు.

ఈసందర్భంగా ఆయన కిల్కారి సేవలు గురించి అవగాహన కల్పించారు. కిల్కారి కాల్ నెంబర్ 911600403660ని గర్భిణీలు బాలింతలు మొబైల్ ఫోన్ లో సేవ్ చేసుకోవాలి అన్ని సూచించారు. మరల వినాలి అనుకుంటే 14423 లేక టోల్ ఫ్రీ నంబర్ కీ ఫోన్ చేసి వినవచ్చు అని తెలిపారు.
కిల్కారి కాల్ నెలకు ఒకసారి వాయిస్ ద్వారా తల్లి బిడ్డల సంరక్షణ గురించి చెపుతారు. ఈ కిల్కారి కాల్ లో గర్భిణీ, బాలింత లు తీసుకోవలిసిన జాగ్రత్తలు చెబుతారు, అలాగే వారు తీసుకోవలసిన పౌష్టికాహారం గురించి, హై రిస్క్ గురించి, బర్త్ ప్లాన్, టీకాలు గురించి, ఫ్యామిలీ ప్లానింగ్ గురించి, రక్తహీనత గురించి ఇలా ప్రతి గర్భిణీ బాలింతలకు అవసరమైన అతి ప్రాముఖ్యమైన సలహాలు సూచనలు చెపుతారు. కిల్కారి కాల్ గర్భిణీ అయినా 4 నెల నుంచి పుట్టిన బిడ్డ సంవత్సరం వరకు వస్తాయి.

ఈ కిల్కారి కాల్ సేవలను ప్రతి గర్భిణీ, బాలింతలు ఉపయోగించు కోవాలిని చెప్పారు. ఈ కార్యక్రమంలో డా. జె. సుమన్, హెచ్ వి నిర్మల, ఏ.ఎన్.ఎం ఉదయ శ్రీ ఆశా కార్యకర్త రాణి తదితరులు పాల్గొన్నారు.