వింబుల్డన్ చాంపియన్‌గా సిన్నర్..

  • ఫైనల్లో జ్వెరెవ్‌పై నాలుగు సెట్ల విజయం..
  • వింబుల్డన్ క్వీన్‌గా లిండా

ఆంధ్రప్రభ, లండన్ : ప్రతిష్ఠాత్మక వింబుల్డన్-2026 ఛాంపియన్‌షిప్‌కు తెరపడింది. ప్రపంచ టెన్నిస్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుతూ ఇటలీ స్టార్ జానిక్ సిన్నర్ వింబుల్డన్-2026 పురుషుల సింగిల్స్ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జర్మనీకి చెందిన ప్రపంచ నంబర్-2 అలెగ్జాండర్ జ్వెరెవ్ ను 6-7(7), 7-6(2), 6-3, 6-4తో ఓడించిన సిన్నర్.. వరుసగా రెండో వింబుల్డన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో తన కెరీర్‌లో ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కూడా ఖాతాలో వేసుకున్నాడు.

కాగా, ఈ మ్యాచ్ లోని మొదటి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయిన సిన్నర్ ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. రెండో సెట్‌ను టైబ్రేక్‌లోనే కైవసం చేసుకుని మ్యాచ్‌పై పట్టుబిగించాడు. అనంతరం మూడో, నాలుగో సెట్లలో అద్భుతమైన ఆటతో జ్వెరెవ్‌కు అవకాశమే ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించాడు.

ఈ మ్యాచ్‌లో సిన్నర్ 15 ఏస్‌లు (aces) సాధించగా, జ్వెరెవ్ 17 ఏస్‌లు కొట్టాడు. అయితే, కీలక సమయాల్లో రెండు బ్రేక్ పాయింట్లను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం సిన్నర్‌కు విజయాన్ని అందించింది. తన మొదటి సర్వ్‌లో 80 శాతం పాయింట్లు గెలుచుకోవడంతో పాటు, రిటర్న్ గేమ్‌లోనూ సిన్నర్ ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ విజయంతో, సిన్నర్ తన కెరీర్‌లో మరో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సాధించడమే కాకుండా, వరుసగా రెండోసారి వింబుల్డన్ ఛాంపియన్‌గా నిలిచి ఆధునిక టెన్నిస్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

ఇతర విభాగాల్లో వింబుల్డన్ 2026 విజేతలు వీరే…

మహిళల సింగిల్స్ విభాగంలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన లిండా నోస్కోవా తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో తన స్వదేశానికే చెందిన కరోలినా ముచోవాపై 6-2, 5-7, 6-3 తేడాతో విజయం సాధించి కెరీర్‌లో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.

డబుల్స్ విభాగంలో పురుషుల టైటిల్‌ను హారి హెలియోవారా (ఫిన్లాండ్), హెన్రీ పాటెన్ (బ్రిటన్) జోడీ కైవసం చేసుకుంది. మహిళల డబుల్స్‌లో గువో హాన్యు (చైనా), క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జంట విజేతలుగా నిలిచింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో మార్సెలో అరేవాలో (ఎల్ సాల్వడోర్), జెలెనా ఒస్టాపెంకో (లాట్వియా) జోడీ ఛాంపియన్‌గా నిలిచింది.

మహిళల డబుల్స్ లో గువో హన్యు (చైనా), క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జోడీ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో గాబ్రియెలా డబ్రోవ్‌స్కీ (కెనడా), లూయిసా స్టెఫానీ (బ్రెజిల్) జోడీని 6-3, 7-5తో ఓడించింది.

మిక్స్‌డ్ డబుల్స్ లో మార్సెలో అవెలారో (ఎల్ సాల్వడోర్), జెలెనా ఒస్టాపెంకో (లాట్వియా) జోడీ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో మార్క్ పోల్మాన్స్, స్టోర్మ్ హంటర్ (ఆస్ట్రేలియా) జోడీపై 4-6, 7-5, 6-2తో విజయం సాధించింది.

వీల్‌చైర్ విభాగంలో..

పురుషుల సింగిల్స్: టొకిటో ఓడా (జపాన్)
మహిళల సింగిల్స్: యుయి కామిజి (జపాన్)
క్వాడ్ సింగిల్స్: నీల్స్ వింక్ (నెదర్లాండ్స్)

వీల్‌చైర్ డబుల్స్ విజేతలు..

పురుషుల డబుల్స్: ఆల్ఫీ హ్యూయిట్, గోర్డన్ రీడ్ (బ్రిటన్)
మహిళల డబుల్స్: యుయి కామిజి (జపాన్), ఝూ జెన్‌జెన్ (చైనా)
క్వాడ్ డబుల్స్: గై సాస్సన్ (ఇజ్రాయెల్), నీల్స్ వింక్ (నెదర్లాండ్స్)

జూనియర్ విభాగం విజేతలు

బాలుర సింగిల్స్: జోర్డాన్ లీ (అమెరికా)
బాలికల సింగిల్స్: అన్నా పుష్కరేవా
బాలుర డబుల్స్: లూయిస్ గుటో మిగెల్ (బ్రెజిల్), జిగా సెస్కో (స్లోవేనియా)
బాలికల డబుల్స్: జానా కోవాచ్‌కోవా, కతెరినా జాజిచ్‌కోవా (చెక్ రిపబ్లిక్)