నూతన గృహప్రవేశానికి హాజరైన డాక్టర్ చంద్రప్రియ
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ నియోజకవర్గంలోని బురాన్‌పల్లి గ్రామంలో నూతనంగా ఇల్లు నిర్మించుకున్న పెద్దింటి సునీత–జంగయ్య దంపతుల గృహప్రవేశ కార్యక్రమానికి మన చంద్ర ఫౌండేషన్ చైర్మన్, మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ కుమార్తె డాక్టర్ చంద్రప్రియ ఆదివారం హాజరయ్యారు.
ఈ సందర్భంగా సునీత–జంగయ్య దంపతులకు నూతన వస్త్రాలను బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహప్రవేశం చేసిన దంపతులను అభినందించారు.
డాక్టర్ చంద్రప్రియ మాట్లాడుతూ, సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకు ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు నిర్మించుకోవాలనే ఆకాంక్ష ఉంటుందని అన్నారు. ఆ కల నెరవేరిన రోజు జీవితంలో ఎంతో సంతృప్తిని అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మన చంద్ర ఫౌండేషన్ సభ్యులు బుచ్చిరెడ్డి, మదనపల్లి రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు.
