సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

ఉట్నూర్, ఆంధ్రప్రభ : నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. ఆయన ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోనికల్లూరుగూడలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలిచేందుకు,వారి సొంతింటి కల నెరవేర్చేందుకు అందిస్తున్న ఇండ్లను నాణ్యతతో నిర్మించుకోవాలని లబ్ధిదారులకు ఎమ్మెల్యే సూచించారు.ఈకార్యక్రమంలో ,కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.