శివనగర్‌లో ప్రత్యేక ఓటరు నమోదు డ్రైవ్
కరీమాబాద్, ఆంధ్రప్రభ: కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఆదివారం శివనగర్‌లో గంట రవికుమార్ పిలుపు మేరకు ఆయన స్వగృహంలో ప్రత్యేక ఓటరు నమోదు, సవరణ డ్రైవ్ నిర్వహించారు. గంట రవికుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొత్త ఓటర్ల నమోదు, ఓటరు జాబితా సవరణలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇప్పటివరకు ఎన్యుమరేషన్ ఫారమ్‌లు నింపని స్థానికులకు కమిటీ సభ్యులు స్వయంగా సహకరించి దరఖాస్తులను పూర్తి చేయించారు.
ఈ సందర్భంగా పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌వోలు) అందజేశారు. ప్రజలందరూ ఓటరు నమోదు, సవరణ ప్రక్రియలో భాగస్వాములు కావాలని గంట రవికుమార్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కందుకూరి విజయ్ కుమార్, సురేష్ పౌడాల, పోశాల సతీష్, కాళీ రాజు, కాల్వల శ్రీనివాస్, బొజ్జ రంజిత్, పరంకుశ శ్రవణ్, గట్ల శరత్ కుమార్, ఎర్ర ప్రకాష్, గంట సందీప్, తౌటం శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
