బెల్లాల్, నర్సింగాపూర్ గ్రామ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు
కడెం, (ఆంధ్రప్రభ): నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఆదేశాల మేరకు కడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో బెల్లాల్, నర్సింగాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీలను ఆదివారం ఏర్పాటు చేశారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించడం లక్ష్యంగా ఈ ఎన్నికలు నిర్వహించారు.
బెల్లాల్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చెన్ను మల్లేశ్ ఎన్నిక కాగా, ఉపాధ్యక్షులుగా గోపు రమేష్, సాకు శివ, ప్రధాన కార్యదర్శిగా ఎం. రాజు, కార్యదర్శులుగా కామాటాల రవి, బుగ్గారం వెంకటేష్, అధికార ప్రతినిధిగా పన్నాల వెంకటేష్ ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా గోపు సత్తన్న, గోవిరవేని సత్తన్న, గోవిరవేని మల్లేశ్, కన్నే శ్రీను బాధ్యతలు చేపట్టారు.
నర్సింగాపూర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా గొల్లా శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా కనగర్తి గంగన్న, ప్రధాన కార్యదర్శిగా కందుల సునీత, కార్యదర్శులుగా సునిల్, పత్తిపాక సత్తన్న, సంగో రమేష్, అధికార ప్రతినిధిగా బియ్యాల తిరుపతి ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఇండ్ల గంగన్న, అర్షం గంగన్న నియమితులయ్యారు.
ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ భూషణ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, ఆర్టీఏ సభ్యులు తుమ్మల మల్లేశ్ యాదవ్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచే కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేసేందుకు కార్యకర్తలు ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. నూతన కమిటీలు పార్టీ విస్తరణకు అంకితభావంతో కృషి చేసి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు గొల్ల వెంకటేష్, సర్పంచ్ బొంతల లక్ష్మి భూమన్న, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పడిగేల రాజు, ప్రధాన కార్యదర్శులు ముడికె మల్లేశ్ యాదవ్, ముస్కూ రాజేందర్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సలీం, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జడా రాజేశ్వర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రెంకాల శ్రీనివాస్, మండల కార్యదర్శి నరేష్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు రాధ సత్తన్నతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
