గురుకుల ఇంటర్ ప్రవేశాలకు 16న స్పాట్ కౌన్సిలింగ్

మంథని, ఆంధ్రప్రభ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల (బాలురు), మంథనిలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ఈ నెల 16న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఉటూరి శ్రీనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపీసీ, ఎంపీసీ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా రెండు విడతల్లో సీట్ల భర్తీ పూర్తయిందని, మిగిలిన సీట్ల కోసం ఈ ప్రక్రియ చేపట్టినట్లు వివరించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు స్పాట్ కౌన్సిలింగ్‌కు దరఖాస్తులు స్వీకరిస్తామని, 16వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

స్పాట్ కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అర్హులైన అభ్యర్థులు పదో తరగతి మెమో, టీసీ, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రాల ఒరిజినల్స్‌తో పాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులు, విద్యార్థి ఆధార్ కార్డు జిరాక్స్, తల్లిదండ్రుల ఆధార్ కార్డుల జిరాక్స్ ప్రతులు, నాలుగు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో కౌన్సిలింగ్ కేంద్రానికి హాజరుకావాలని ప్రిన్సిపాల్ సూచించారు.