చేనేత సంఘం అధ్యక్షుడిగా బడుగు మోహన్ బాబు ఏకగ్రీవ ఎన్నిక
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ చేనేత సహకార సంఘం నూతన అధ్యక్షుడిగా బడుగు మోహన్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి ప్యానల్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించారు.
ఉపాధ్యక్షుడిగా గోశిక శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా కాటబత్తిని భీమయ్య, కోశాధికారిగా బడుగు సావిత్రి ఎన్నికయ్యారు. పాలక మండలి సభ్యులుగా గోశిక లక్ష్మీపతి, గోశిక నరసింహ, పాపని రామకృష్ణ, దోర్నాల లక్ష్మీనారాయణ, బత్తుల మానస ఎన్నికైనట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బడుగు మోహన్ బాబు మాట్లాడుతూ, తన తండ్రి బాటలోనే నడుస్తూ చేనేత కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. సంఘం అభివృద్ధికి తన వంతు బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, మాజీ మార్కెట్ చైర్మన్ బడుగు లక్ష్మయ్య, మాజీ ఎంపీపీ చిక్క నరసింహ, మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మున్సిపల్ కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్, చేనేత నాయకులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. నూతన కార్యవర్గాన్ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
