ఆరెంజ్ కలర్ డే వేడుకల్లో మెరిసిన చిన్నారులు
చౌటుప్పల్ (ఆంధ్రప్రభ): చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ట్రినిటీ హైస్కూల్ ఐఐటీ జోన్‌లో ‘ఆరెంజ్ కలర్ డే’ సంబరాలను పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. చిన్నారులందరూ ఆరెంజ్ రంగు దుస్తులు ధరించి హాజరుకావడంతో పాఠశాల ప్రాంగణం నారింజ వనంలా కళకళలాడింది. ఈ కార్యక్రమాన్ని ట్రినిటీ హైస్కూల్ ప్రిన్సిపాల్ కం డైరెక్టర్ ఉజ్జిని మంజుల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మంజుల మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలకు రంగులపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం విద్యార్థులు ఆరెంజ్ రంగులో ఉండే పండ్లు, స్వీట్లు ప్రదర్శించి వాటి ప్రాధాన్యతను వివరించారు. నారింజ పండ్లలో ‘సి-విటమిన్’ పుష్కలంగా ఉండి రోగనిరోధక శక్తి పెరుగుతుందని పాఠశాల చైర్మన్ కేవీబీ కృష్ణారావు తెలిపారు. కార్యక్రమంలో ఐఐటీ జోన్ ఇంచార్జ్ అనుష, కోఆర్డినేటర్ చందన, ఉపాధ్యాయులు శిరీష, హారిక, రత్న, భార్గవి, సింధు, లావణ్య, రేణుక, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
