అభివృద్ధి ఫలాలు ప్రజలకేనా? పెట్టుబడిదారులకేనా?
అభివృద్ధి ఫలాలు ప్రజలకేనా? పెట్టుబడిదారులకేనా?
ప్రైవేటీకరణతో తగ్గుతున్న ప్రభుత్వ ఉద్యోగాలు
జీడీపీ పెరుగుదలతో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయా?
గాంధీజీ ఆర్థిక విధానాలు.. సమానత్వానికి మార్గం
బిలియనీర్ల పెరుగుదల.. నిరుద్యోగ నిర్మూలనకు దూరం
మన పాలకులు స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులతో దేశాభివృద్ధి జరగాలని భావించి ప్రభుత్వ రంగంలో ఉత్పత్తి కార్యక్రమాలన్నీ మానేసి వృద్ధి ప్రక్రియ అంతా పెట్టుబడిదారీ కనసన్నల్లో ఉన్నందున దేశ సంపద కొందరిదిగా అయిపోతున్నది. 1991 నుంచి సరళీకృత ఆర్థిక విధానాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేయడం జరుగుతున్నది. 2013లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 17.3 లక్షల ఉద్యోగాలు ఉండగా 2022 నాటికి ఉద్యోగాలు 10 లక్షలకు తగ్గిపోయాయి. అందులోనూ కాంట్రాక్టు కార్మికులుగా 43శాతం మందికి నియామకాలు జరిగాయి. ఇలా దేశంలో మెల్లగా ప్రైవేటు రంగం విస్తరించి కార్పొరేట్ రంగానికి పునాదులు బలంగా ఏర్పడడంతో ఉద్యోగ కల్పన లేక నిరుద్యోగులు గిగ్ వర్కర్లుగా జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మన దేశం యొక్క తలసరి ఆదాయం ప్రస్తుతం 3 డాలర్లు ఉండగా ఉన్నత ఆదాయ వర్గాల పై భాగంలో ఉన్న 10శాతం ధనికుల ఆదాయం 14 వేల మిలియన్ డాలర్లుగా ఉంది.
అభివృద్ధి అంటే అందరి వృద్ధి, అంతేగాని కొందరి వృద్ధి మాత్రం కాదు అని గాంధీజీ అన్నారు. దేశపు ఆదాయం ఎంత అనేది ముఖ్యం కాదు, ప్రజల కనీస అవసరాలు అయిన తిండి, బట్ట, విద్య, వైద్యం ఏ మేరకు పొందగలుగుతున్నారనేది ముఖ్యమన్నారు. ప్రభుత్వాలు సేవకులుగా పనిచేయాలి గాని, పెత్తందారులుగా ప్రజలపై జులుం చలాయించకూడదు అన్నారు.
ప్రజల కనీస అవసరాలు తీర్చే విధంగా పాలన చేసేదే రాజ్యం. గాంధీజీ ప్రకారం పెట్టుబడిదారీ వ్యవస్థ నిరుద్యోగాన్ని నిర్మూలించలేదు. పరిపాలన విధానాలు చట్టాల ద్వారా అందరికీ క్షేమం అందించేదే రాజ్యం.
మహాత్మాగాంధీ ప్రాథమిక ఆర్థిక విధానాలుగా ఆర్థిక వికేంద్రీకరణ, స్వయం సమృద్ధి, పరస్పర సహకారం, సమానత్వం, మానవతా దృక్పథం, అహింసా విధానం, గ్రామీణ స్వయం పోషకత్వం వంటి విధానాలను దేశాభివృద్ధికి, మానవ శ్రేయస్సుకు మూలాలుగా భావించారు.
బిలియనీర్ల పెరుగుదలకు జీడీపీ పెరుగుదలకు సంబంధం ఉంటుందే గాని నిరుద్యోగ నిర్మూలనకు సంబంధం లేదని మన పాలకులకు తెలియదా?
మన దేశంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పెరుగుదల అందరినీ కలుపుకొని పోయే విధంగా సమ్మిళిత వృద్ధిగా జరగలేదు. నేడు దేశంలో 50శాతం జనాభా ఈ జీడీపీ పెరుగుదలకు దూరంగా ఉన్నారని తెలిసినా మన పాలకులు దీనిని పట్టించుకోక, ఎంతసేపు జీడీపీ పెరుగుదలనే కొలమానంగా భావిస్తున్నారు.
జీడీపీ పెరుగుదలతో ఉద్యోగ కల్పనగాని, ప్రజల ఆదాయాలు పెరగడంగాని, ప్రజాశ్రేయస్సు పెంపొందించడంగాని నామమాత్రంగా ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే.
…
తమరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ప్రజల కోసమా, పెట్టుబడిదారుల కోసమా అనే ప్రశ్న వేసుకోవాలి.
1991 నుంచి సరళీకృత ఆర్థిక విధాన నేపథ్యంలో ప్రక్రియ ప్రారంభమైంది. మనదేశంలో 5062 విదేశీ కంపెనీలు ఉన్నాయి. వారి దప్పిక తీరలేదు అన్నట్లు ప్రైవేటీకరణ ప్రక్రియ ఇప్పుడు పతాక స్థాయికి చేరుకున్నది.
2017-18 వరకు 3,47,439 కోట్ల మేరకు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేశారు. 75 ఏళ్ల స్వాతంత్య్రంలో భారతదేశం పరాధీన భారతంగా మారే పరిస్థితి ఇదేనేమో!
నూతన ఆర్థిక విధానాలు చేపట్టేటప్పుడు మన దేశంలో ఒకే ఒక బిలియనీర్ ఉండగా నేడు 309 మందికి పెరిగినారు. మన స్థూల జాతీయ ఉత్పత్తిలో వీరి వాటా 33 శాతంగా ఉంది.
140 కోట్ల ప్రజలకు మిగిలింది ఏంటో జవాబు చెప్పాల్సిందే మన పాలకులే. ఎందుకంటే వీరు దేశీయ బూర్జువాలతోనే కాకుండా విదేశీ పెట్టుబడుల కోసం ఆరులు చాచడం వల్ల ఏర్పడేది పరాధీనం, పరాజయం మాత్రమే!
జొన్నలు వేస్తే వరి పండుతుందని ప్రజలు నమ్ముతారా?
నేటి పాలకులు ఆనాటి గాంధీజీ ఆర్థిక విధానాలకు స్వస్తి చెప్పి దేశ ఆర్థిక వ్యవస్థను పెట్టుబడిదారుల పరం చేస్తున్నది అంటే.
