జగన్మాతను దర్శించుకున్న మంత్రి వాసంశెట్టి…
కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు…
ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం.
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
అనంతరం వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాన్ని బహూకరించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆవురి శ్రీనివాసరావు పాల్గొని, మంత్రి కుటుంబానికి స్వాగతం పలికినారు.
