Spain beat Belgium 2-1 : స్పెయిన్​ మెరీనో విక్టరీ Andhra Prabha sports Story

Spain beat Belgium 2-1 : స్పెయిన్​ మెరీనో విక్టరీ Andhra Prabha sports Story

  • 2-1 తేడాతో అద్భుత విజయం
  • బెల్జియం బ్యాడ్​ లక్​
  • సెమీస్​ లో ఫ్రాన్స్​ తో ఢీ

(ఆంధ్రప్రభ, లాస్​ ఏంజిల్స్​ ప్రతినిధి )

అమెరికా లాజ్​ ఏంజిల్స్​ లో స్పెయిన్​ , బెల్జియం మధ్య హైవోల్టేజీ మ్యాచ్​ జరుగుతుందని.. ప్నెయిన్​ జట్టే ఈ మ్యాచ్​ లో హాట్​ ఫేవరేట్​ గా.. సాకర్​ ప్రియులు ముందుగానే ఊహించారు. ఈ క్వార్టర్​ ఫైనల్​ లో బెల్జియంను ఓడించి సెమీ ఫైనల్​ కు దూసుకు పోతుందనే అంచనా నిజమైంది. కానీ ఈ మ్యాచ్​లో.. బెల్జియం .జట్టు డూ ఆర్​ డై రీతిలో ఆద్యంతం పోరాడి ఓడి పోయింది గాయంతో జట్టు రథసారథి, వికెట్​ కీపర్​ వెదొలగటంతో… విజయ లక్ష్మీ స్పెయిన్​ జట్టును వరించింది. లాస్ ఏంజిల్స్ సోఫీ స్టేడియం వేదికగా జరిగిన ఫిపా ప్రపంచకప్ 2026 రెండో క్వార్టర్ ఫైనల్‌లో బెల్జియంపై స్పెయిన్ 2-1 తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. జూలై 14న డల్లాస్‌లో జరిగే మొదటి సెమీస్‌లో ఫ్రాన్స్ జట్టుతో తలపడనుంది.

Spain beat Belgium 2-1 : బెల్జియం బ్యాడ్​ లక్​

ఈ మ్యాచ్ ఆరంభానికి ముందే బెల్జియం కెప్టెన్ యూరి టైల్‌మన్స్ గాయం మ్యాచ్‌కు దూరమయ్యాడు. మ్యాచ్ 30వ నిమిషంలో స్పెయిన్ ఆటగాడు డాని ఓల్మో కొట్టిన షాట్‌ను బెల్జియం కీపర్ తిబోత్ కోర్టోయిస్ అడ్డుకున్నప్పటికీ, రీబౌండ్ అయిన బంతిని ఫాబియన్ రూయిజ్ చాకచక్యంగా గోల్‌గా మలిచాడు. మొదటి హాఫ్ ముగిసే సమయానికి (41వ నిమిషం) బెల్జియం పుంజుకుంది. కెవిన్ డి బ్రూయిన్ అందించిన అద్భుత పాస్‌ను తిమోతీ కాస్టాగ్నే క్రాస్ చేయగా, చార్లెస్ డి కెటెలారే తన హెడర్ తో గోల్ చేసి స్కోరును సమం చేశాడు. దీంతో స్పెయిన్ కీపర్ ఉనై సిమోన్ వరుసగా 65 నిమిషాల పాటు గోల్ పడకుండా ఉంచిన రికార్డుకు బ్రేక్ చేశాడు. రెండవ అర్థభాగం మ్యాచ్ 71వ నిమిషంలో బెల్జియం స్టార్ కీపర్ తిబోత్ కోర్టోయిస్ గాయపడి కన్నీళ్లతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అతని స్థానంలో బ్యాకప్ కీపర్ సెన్నే లామెన్స్ రంగంలోకి దిగాడు. మ్యాచ్ డ్రా వైపు వెళ్తుందనుకున్న తరుణంలో 88వ నిమిషంలో స్పెయిన్ డిఫెండర్ పావ్ కుబార్సి దూరం నుండి కొట్టిన షాట్‌ను బెల్జియం సబ్‌స్టిట్యూట్ కీపర్ లామెన్స్ సరిగ్గా నియంత్రించలేక చేజార్చాడు . అప్పటికే సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన మైకెల్ మెరినో ఆ లూజ్ బాల్‌ను చిరుతలా దూకి గోల్ పోస్ట్‌లోకి పంపాడు.

Spain beat Belgium 2-1 : లాస్ట్​ మినిట్ మ్యాజిక్​

రెఫరీ 7 నిమిషాల అదనపు సమయాన్ని ఇచ్చారు. బెల్జియం స్ట్రైకర్ రొమేలు లుకాకు గోల్ చేపే ప్రయత్నాన్ని స్పెయిన్ డిఫెన్స్ , కీపర్ ఉనై సిమోన్ విజయవంతంగా తిప్పికొట్టారు. చివరి నిమిషంలో బెల్జియం ఆటగాడు యాక్సెల్ విట్సెల్ పసుపు కార్డుతో వైదొలిగాడు. పోర్చుగల్‌పై కూడా ఇలాగే చివరి నిమిషంలో గోల్ కొట్టిన మైకెల్ మెరినో, ఈ మ్యాచ్‌లోనూ మళ్లీ స్పెయిన్ పాలిట రియల్ హీరోగా అవతరించాడు.